Monday, September 30, 2024

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో త్వరలోనే 3035 ఉద్యోగ నియామకాలు

 


 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో త్వరలోనే 3035 ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రకటించారు. ఆర్టీసీలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఆదివారం కరీంనగర్ లో 33 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి పొన్నం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఈ శుభవార్త చెప్పారు.

రాష్ట్రంలో మహాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల బ‌స్సుల‌కు విప‌రీతంగా డిమాండ్ పెరిగింది. ర‌ద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వ గ్రాంట్స్ ద్వారా కొత్త బ‌స్సుల కొనుగోలుకు టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తోంది. కొత్త బ‌స్సులకు స‌రిప‌డా ఉద్యోగ ఖాళీల‌ భ‌ర్తీ చేపట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే వివిధ విభాగాల్లో మొత్తం 3035 పోస్టుల నియామ‌క ప్ర‌కియ చేపట్టనుంది.ఇటీవలే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వీటిలో

2000 డ్రైవర్‌ పోస్టులు ఉండగా.. 

743 శ్రామిక్‌,
114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌),
84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌),
25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌,
23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌),
15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌,
11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌),
7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌),
7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషాలిస్ట్‌) ఉద్యోగాలు ఉన్నాయి.