Sunday, September 22, 2024

ECILలో 437 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. హైదరాబాద్‌లో పోస్టింగ్‌

 

 


 

 ECILలో 437 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. హైదరాబాద్‌లో పోస్టింగ్‌ 

 Notification Download

 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: ECIL నుండి ఈనోటిఫికేషన్ విడుదల చేశారు. 

భర్తీ చేస్తున్న పోస్టులు: వివిధ ట్రేడ్లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

అర్హత : సంబంధిత ట్రెడ్ లో ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఈ పోస్టులకు తెలంగాణలో నివసిస్తున్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: ఈ నోటిఫికేషన్ ద్వారా 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల

వయస్సులో సడలింపు: క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

అప్రెంటిస్ శిక్షణా కాలం: ఒక సంవత్సరం .

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 13-09-2024

అప్లికేషన్ చివరి తేదీ: 29-09-2024

అప్లికేషన్ విధానం: ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

ఎంపిక విధానం: ITI లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం పోస్టుల్లో 70% పోస్టులు గవర్నమెంట్ ITI విద్యార్థులతో మరియు 30% పోస్టులు ప్రైవేట్ ITI విద్యార్థులతో భర్తీ చేస్తారు.

 Notification Download

డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే తేదీలు:
ఎంపిక అయిన వారికి అక్టోబర్ 7 నుండి 9 తేదీల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీల వివరాలు అభ్యర్థులకు Email ద్వారా తెలియజేస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే ప్రదేశం:

 ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL, Hyderabad – 500062.