Tuesday, August 20, 2024

M Kisan: రైతులకు పీఎం కిసాన్‌ విడత డబ్బులు పడకపోతే .... ఈకేవైసీని అప్‌డేట్ చేయండిలా..

 


 వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనంపొందుతున్నారు. అయితే పథకంయొక్క ప్రయోజనాలను పొందేందుకు రైతులు e-KYC, భూమి ధృవీకరణ పొందవలసి ఉంటుంది. ఒక రైతు ఈ-కేవీసీని పొందకపోతే అతనికి రావాల్సిన డబ్బులు మొత్తం నిలిచిపోతాయి. పథకం కోసం e-KYC చేసే ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6000 అందజేస్తుంది.. ఈ మొత్తం విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది.ప్రభుత్వం ఏడాదిలో మూడు విడతలుగా ఈ పథకాన్ని విడుదల చేస్తుంది. ప్రతి విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు వస్తాయి. ఇప్పటి వరకు 16వ విడత రైతుల ఖాతాల్లోకి చేరింది. ఇప్పుడు రైతులు 17వ విడత పీఎం కిసాన్ యోజన కోసం ఎదురుచూస్తున్నారు.ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేక నిబంధనలను కూడా రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం e-KYC చేసిన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత లేదా కొత్త అనే తేడా లేకుండా పథకం లబ్ధిదారులందరూ ఈ పని చేయడం చాలా అవసరం.

 

 

ఈకేవైసీని అప్‌డేట్ చేయండిలా..

*♦️రైతులు తమ సమీప CSC కేంద్రాన్ని సందర్శించాలి.*

*♦️అధికారిక PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌కి వెళ్లండి.*

*♦️మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.*

*♦️తర్వాత "సెర్చ్" బటన్‌పై క్లిక్ చేయండి.*

*♦️ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి*

*♦️“గెట్ మొబైల్ OTP” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు ధృవీకరణ కోడ్ వస్తుంది.*

*♦️పోర్టల్‌లో OTPని నమోదు చేసి, ఆపై “Submit for Auth” బటన్‌పై క్లిక్ చేయండి.*

*♦️అలా చేయగానే PM కిసాన్ KYC అప్‌డేట్ పూర్తవుతుంది.*

*💥PM కిసాన్ KYC స్థితిని తనిఖీ చేయండి.....కేవైసీ స్టేటస్ తనిఖీ చేయండిలా..*

*♦️PM కిసాన్ KYC స్టేటస్ పేజీని సందర్శించడానికి వెబ్‌సైట్‌లోకి వెళ్లి "క్లిక్ హియర్"అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి*

*♦️అందించిన ఫీల్డ్‌లో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.*

*♦️క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి*

*♦️'సర్చ్' బటన్‌పై క్లిక్ చేయండి*

*♦️సదరు పేజీ PM కిసాన్ KYC స్థితిని డిస్‌ప్లే చేస్తుంది. ఇది KYC విజయవంతంగా పూర్తయిందా లేదా తదుపరి చర్య అవసరమైతే సూచిస్తుంది.*

*💥లబ్ధిదారుడి స్థితిని తనిఖీ చేయండిలా..*

*♦️అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి*

*♦️పేజీకి కుడి వైపున ఉన్న 'నో యువర్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి*

*♦️రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. 'డేటా పొందండి' ఆప్షన్ ఎంపిక చేయండి.*

*♦️తద్వారా లబ్ధిదారుడి స్థితి డిస్ ప్లే అవుతుంది.*

*💥లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయండిలా..*

*♦️PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.*

*♦️హోంపేజీలో "PM కిసాన్ లబ్ధిదారుల జాబితా" మెనుపై క్లిక్ చేయండి.*

*♦️ఆప్షన్ల నుంచి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, తహసీల్, గ్రామం, బ్లాక్‌ని ఎంచుకోండి.*

*♦️'గెట్ రిపోర్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి*

*♦️2024 PM కిసాన్ 17వ లబ్ధిదారుల జాబితా మీ స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది.*

*💥కిసాన్ సమ్మాన్ నిధి కోసం దరఖాస్తు చేయండిలా..*

*♦️వెబ్‌సైట్‌లోకి వెళ్లడానికి ఈ లింక్ క్లిక్ చేయండి*

*♦️'న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయండి.అవసరమైన వివరాలను నమోదు చేసి, 'అవును' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.*

*♦️PM-కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో అడిగిన సమాచారాన్ని పూరించండి. దానిని సేవ్ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.*

వీళ్లకు పీఎం కిసాన్​ రాదు


*♦️మినహాయింపు వర్గానికి చెందిన రైతులు*

*♦️దరఖాస్తు ఫారమ్‌లో IFSC కోడ్ తప్పు*

*♦️పనిచేయని, క్లోజ్​ అయిన బ్యాంకు ఖాతాలు*

*♦️బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్​లింక్​ లేకపోతే*

*♦️అసంపూర్తి దరఖాస్తు*

*♦️బ్యాంక్​ వివరాలు, పోస్టాఫీసు వివరాలు సక్రమంగా నమోదు కాకపోతే*

*♦️ఆధార్​ నంబర్​ తప్పుగా నమోదు కావడం..*