Saturday, August 17, 2024

26 లేదా.. ఆ తరువాత ఎప్పుడైనా డిఎస్సీ ఫలితాలు!

 


  •  అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచే అవకాశం
  •   ఫైనల్ కీతోపాటే ఫలితాలు ప్రకటన

 

 రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సీ - 2024 పరీక్షలకి సంబంధించిన ఫలితాలను ఈ నెల 26న లేదంటే ఆ తరువాత ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీఎస్సీ- 2024కి సంబంధించిన ప్రాథమిక కీని పాఠశాల విద్య శాఖ అధికారులు విడుదల చేశారు. 

స్కూల్   అసిస్టెంట్(ఎస్ఏ), లాంగ్వేజ్ పండిట్(ఎల్పీ), సెకండరీగ్రేడ్ టీచర్(ఎస్జీటీ),ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) పోస్టులకి సంబంధించి   వేర్వేరుగా ప్రాథమిక కీని విడుదల చేశారు. అభ్యర్థుకి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ ని కూడా పాఠశాల విద్య శాఖ అధికారిక వెబ్ సైట్ లోపొందుపరిచారు. ఈ నెల20వ తేది సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమకి కీపై అభ్యంతరాలను   స్వీకరించనున్నారు.అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫైనల్   కీని,ఫలితాలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనల్ కీని విడుదల చేసి తరువాత కొద్ది రోజులు సమయం తీసుకొని ఫలితాలను   ప్రకటిస్తే.. ఆ లోపు ఫైనల్ కీపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మళ్ళీ తుది తీర్పు వచ్చే వరకు ఆగాల్సి   ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా ఒకేరోజు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.అయితే ప్రాథమిక కీపై   అభ్యంతరాలను ఈ నెల 20 వరకు స్వీకరిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించినప్పటికీ. ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి వెబ్ సైట్  లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు పాఠశాల విద్య శుక్రవారం(ఆగస్టు 16)   సాయంత్రం ప్రకటించింది. సమస్య ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని   ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక కీపై అభ్యంతరాలను   స్వీకరించడానికి మరో రెండు, మూడు రోజుల గడువును పొడిగించే అవకాశం ఉంటుందనే   అభిప్రాయం డిఎస్సీ రాసిన అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక కీ పై   అభ్యంతరాలను ఈ నెల 22 లేదా 23 వరకు స్వీకరించే అవకాశం వారు చెబుతున్నారు.దీంతో ప్రాథమిక కీ పై   అభ్యంతరాలను స్వీకరించి .. అనంతరం ఫైనల్ కీని దాంతోపాటు ఫలితాలను అవకాశం ఉంటే ఈ నెల 26న ప్రకటించే   అవకాశం ఉన్నట్టు అభ్యర్థుల్లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ 26నప్రకటించకపోతే  ఈ నెలాఖరు నాటికి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితాల ప్రకటన అనంతరం వారం, 10 రోజుల్లో 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఫైనల్ కీ తరువాతఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.