Wednesday, August 14, 2024

టెలికాం కొత్త రూల్స్.. ఇలా చేస్తే రెండేళ్లు బ్లాక్ లిస్ట్‌లోకి.. సెప్టెంబర్ 1 నుండి

 


 

 ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ నుంచి బయటపడేందుకు TRAI ఈ కొత్త నిబంధనను అమలు చేస్తోంది. మోసం లేదా బోగస్ కాల్స్ గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే టెలికాం కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రాయ్ హెచ్చరించింది.


న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ రూల్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి టెలికాం రంగంలో పెద్ద మార్పు రానుంది. అదేంటంటే టైం లిమిట్ ఉల్లంఘిస్తే, సిమ్ కార్డ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది.

అందువల్ల, మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీరు ప్రమాదానికి గురవుతారు. అవును, ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ నుంచి బయటపడేందుకు TRAI ఈ కొత్త నిబంధనను అమలు చేస్తోంది. మోసం లేదా బోగస్ కాల్స్ గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే టెలికాం కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రాయ్ హెచ్చరించింది.
TRAI కొత్త నిబంధన ప్రకారం, కస్టమర్లకి  అన్ వాంటెడ్ కాల్స్, నకిలీ కాల్స్, మార్కెటింగ్ సహా ఎటువంటి క్యాంపైన్ కాల్స్ చేయలేరు. అలాగే, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఫేక్ కాల్స్‌ను అరికట్టాలి. ఇందుకోసం ఫేక్ కాల్స్ నియంత్రణకు కృత్రిమ మేధస్సు సాయం తీసుకోవాలని ట్రాయ్ సూచించింది.  కస్టమర్‌కు ఫేక్ కాల్స్ వస్తే టెలికాం ఆపరేటర్, ఫేక్ కాల్స్ చేసిన కంపెనీలు లేదా వ్యక్తులు శిక్షార్హులు అవుతారు. లేదా నకిలీ కాలింగ్ ఫోన్ నంబర్లు 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్ అవుతాయి.
కొత్త పద్ధతి, కొత్త మోడల్ ద్వారా కస్టమర్లకు ఫేక్ కాల్స్ చేస్తుంటారు. పలు కంపెనీలు వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ప్రైవేట్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి కస్టమర్లని వేధిస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో స్పామ్ కాల్స్ నియంత్రణకు ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంటోంది.

స్పామ్ కాల్స్ లేదా ఫేక్ కాల్స్‌పై కస్టమర్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇటీవల కంపెనీల ప్రమోషన్ కు సంబంధించి స్పామ్ కాల్స్ వస్తున్నాయి. అన్ వాంటెడ్  కాల్స్‌తో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఫేక్ కాల్స్‌తో మోసపోతున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. స్పామ్ కాల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రాయ్.. ఈ మొత్తం సమాచారం ఆధారంగా ఇప్పుడు కొత్త నిబంధనను రూపొందించింది. అయితే, సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది.