NPCI- నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలో UPI కస్టమర్ల కోసం ఒక పెద్ద సర్వీస్ ని ప్రారంభించబోతోంది. కొత్త సర్వీస్ ప్రారంభం తర్వాత మీ UPI అకౌంట్ కూడా క్రెడిట్ కార్డ్ లాగా పని చేస్తుంది. అంటే మీ అకౌంట్ లో డబ్బు లేకపోయినా కూడా UPI పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు వినియోగదారుల UPI అకౌంట్ క్రెడిట్ కార్డ్‌గా పని చేస్తుందని, ప్రతి కస్టమర్ తన CIBIL స్కోర్ ప్రకారం క్రెడిట్ లిమిట్ పొందుతారని NPCI తెలిపింది. ఈ క్రెడిట్‌ను వ్యాపారితో మాత్రమే ఉపయోగించవచ్చు. దీనికి బ్యాంకులు వడ్డీని కూడా వసూలు చేస్తాయి. ఈ కొత్త సర్వీస్ కి సంబంధించి NPCI అనేక ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులతో మాట్లాడింది, అవి కూడా దీనికి అంగీకరించాయి. ఈ సదుపాయం కోసం NPCIకి ఇప్పటివరకు ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, PNB, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ లభించింది.
ఈ సదుపాయం వల్ల కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా దుకాణదారులు కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం, క్రెడిట్ కార్డు ద్వారా రూ. 2 వేలకు పైగా చెల్లింపు చేస్తే, దాదాపు 2 శాతం ఛార్జీ చెల్లించాలి. UPIలో క్రెడిట్ లైన్ పొందిన తర్వాత అటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కార్డ్‌పై ఎలాంటి వడ్డీని చెల్లించనవసరం లేదు.
మీరు UPI అందించే ఈ సర్వీస్ ని ఉపయోగించే వరకు UPI ద్వారా లభించే క్రెడిట్ లైన్‌పై మీరు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఉపయోగించే నిధుల మొత్తానికి మాత్రమే మీరు వడ్డీని చెల్లించాలి. ఒక విధంగా, ఇది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం మాదిరి పని చేస్తుంది. మీరు రూ.20 వేలు క్రెడిట్ లైన్ పొంది రూ.10 వేలు మాత్రమే ఉపయోగించారనుకోండి, అప్పుడు మీరు రూ.10 వేలకు మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.