Sunday, December 4, 2022

USB Type C Connector : భారత్ కూడా కామన్ ఛార్జింగ్ పోర్ట్‌పై ఒక నిర్ణయానికి వచ్చింది. స్టాండర్డ్‌ ఛార్జర్‌లు వచ్చిన తర్వాత..

 USB Type C Connector : భారత్ కూడా కామన్ ఛార్జింగ్ పోర్ట్‌పై ఒక నిర్ణయానికి వచ్చింది. స్టాండర్డ్‌ ఛార్జర్‌లు వచ్చిన తర్వాత.. ఫోన్‌ తయారీదారులు యూజర్లకు బాక్స్‌లో ఛార్జర్‌లను రవాణా చేయనవసరం లేదు.

USB Type C Port for All Devices : ప్రస్తుతం వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ (Smartphones)లకు ప్రత్యేక ఛార్జర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. సాధారణంగా మొబైల్స్‌ పోర్ట్‌లు అన్నింటికీ ఒకేలా ఉండవు. దీంతో ఒక ఛార్జర్‌ను మరో ఫోన్‌కు వినియోగించలేని పరిస్థితి. ఫలితంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరగడానికి కూడా ఇది కారణమవుతోంది. ఈ సమస్యలను దూరం చేసేందుకు వివిధ దేశాలు కామన్‌ పోర్ట్‌ తీసుకురావాలని చెబుతున్నాయి.

తాజాగా భారత్ కూడా కామన్ ఛార్జింగ్ పోర్ట్‌పై ఒక నిర్ణయానికి వచ్చింది. స్టాండర్డ్‌ ఛార్జర్‌లు వచ్చిన తర్వాత.. ఫోన్‌ తయారీదారులు యూజర్లకు బాక్స్‌లో ఛార్జర్‌లను రవాణా చేయనవసరం లేదు. వినియోగదారుల వద్ద అప్పటికే అవసరమైన ఛార్జర్‌లు ఉంటాయి అవి అన్నింటికీ సరిపోతాయి. ఇలా ఇరు వర్గాల ఖర్చులు ఆదా అవుతాయి. యూరోపియన్ యూనియన్ ఇటీవల ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 2024 నాటికి అన్ని మొబైల్ డివైజ్‌లు, టాబ్లెట్‌లకు USB-C పోర్ట్‌లు ఉండటాన్ని తప్పనిసరి చేసింది. ఈ దిశగా ప్రముఖ కంపెనీలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి. తాజాగా ఇండియాలో కూడా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.

ఇండియా ప్రస్తుతం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంటర్‌ మినిస్ట్రియల్‌ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో వాటాదారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత భారతదేశం అన్ని స్మార్ట్ డివైజ్‌లకు USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ ఉండాలనే నిబంధనలు తీసుకొస్తుంది.



USB-C Port అంటే ఏంటి..? ఉపయోగాలు ఏంటి..?
ఈ మధ్య రిలీజ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో USB Type- C port అనే స్పెసిఫికేషన్‌ను మనం వింటున్నాం. వాస్తవానికి.. యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అనేది ఓ కొత్త యూఎస్బీ స్టాండర్డ్. దీన్నే యూఎస్బీ 3.1 అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని యూఎస్బీ వర్షన్‌లకు ఇది అప్‌డేటెడ్ వర్షన్. ప్రస్తుతానికి మనం వాడుతున్న యూఎస్బీ టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం ఒక సైడ్ మాత్రమే కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.

 
కొత్తగా అందుబాటులోకి వచ్చిన USB Type- C port రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది. USB Type-C port అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది. డేటాను హై స్పీడ్ వేగంతో ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అలానే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ టైప్ - సీ పోర్ట్ బై డైరక్షనల్ పద్ధతిలో పవర్.. అలానే డేటాను సెండ్ చేయటంతో పాటు రీసీవ్ కూడా చేసుకుంటుంది. ఈ సదుపాయంతో రెండు డివైస్‌ల మధ్య డేటా అలానే పవర్‌ను అటు ఇటు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.



Type-C port కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేకమైన అడాప్టర్‌కు HDMI, VGA, Display తదితర కనెక్షన్‌లను అనుసంధానించుకుని హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే Type-C port అందుబాటులోకి రావటం వల్ల ఇక పై ఎక్కువ కేబుల్స్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల కనెక్టువిటీ పనులను యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ పోర్ట్ సింపుల్ గా చక్కబెట్టేస్తుంది. రెండు డివైస్ లను USB Type-C port ఆధారంగా కనెక్ట్ చేయాలంటే కచ్చితంగా ఆ రెండు డివైస్‌లు టైప్ - సీ పోర్ట్‌ లను కలిగి ఉండాలి.