Saturday, January 30, 2021

గాలి ద్వారా ఫోన్ ను చార్జ్ చేసే షియోమి వైర్ లెస్ రిమోట్ చార్జర్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందంటే ?

ఎలెక్త్రోనిక్ తయారీ సంస్థ షియోమి తాజాగా ఒక కొత్త వైర్‌లెస్ ఛార్జర్ ఎం‌ఐ ఎయిర్ ఛార్జ్‌ను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ ఛార్జర్, దీని ద్వారా మీరు మీ స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయడానికి ఛార్జర్‌ లేదా ఇతర డివైజ్ తాకనవసరం లేదు. నిజం చెప్పాలంటే మీ ఫోన్‌ను రిమోట్‌గా ఛార్జ్ చేసే విధంగా ఐ ఎయిర్ ఛార్జ్ రూపొందించారు. 

 

 


ఎం‌ఐ ఎయిర్ ఛార్జ్‌తో   మీరు చార్జింగ్  కేబుల్ లేకుండా లేదా వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్ లేకుండా ఏదైనా డివైజ్ ని ఛార్జ్ చేయవచ్చు. ఎం‌ఐ  ఎయిర్ ఛార్జ్ నిజంగా వైర్‌లెస్ ఛార్జర్. షియోమి ఎం‌ఐ ఎయిర్ ఛార్జర్ టాబ్లెట్లు, ఫోన్లు, ఇతర వైర్‌లెస్ ఛార్జింగ్ డివైజెస్ నాలుగు సెంటీమీటర్ల దూరం నుండి ఛార్జ్ చేయగలదు, అయితే ప్రస్తుతం షియోమి ఈ ఛార్జర్ లభ్యత గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.  

 

 

కానీ ఇది ఒక కాన్సెప్ట్ ఛార్జర్ కావచ్చు. ఈ షియోమి ఛార్జర్‌తో 5 వాట్ల సామర్థ్యంతో ఒకేసారి మల్టీ డివైజెస్ ఛార్జ్ చేయవచ్చు. భవిష్యత్తులో, ఈ ఛార్జర్ కార్యాలయల్లో, బహిరంగ ప్రదేశలలో, అతిథి గదిలో ఉపయోగించవచ్చు. షియోమి సంస్థ ఈ లేటెస్ట్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ఛార్జర్  డిజైన్ బాక్స్ లాగా ఉంటుంది, దీనికి డిస్ ప్లే కూడా కలిగి ఉంటుంది. ఈ డిస్ ప్లే లో బ్యాటరీ లెవెల్, ఛార్జింగ్ స్టాత్సుస్ కనిపిస్తుంది.