Thursday, December 17, 2020

Whatsapp లో మరో అదిరిపోయే ఫీచర్

 ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ తన వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామరో సరికొత్త ఫీచర్ ని పరిచయం చేయబోతుంది. వాట్సాప్ వెబ్ వెర్షన్లో త్వరలో వీడియో/వాయిస్ కాల్ ఫీచర్ ని తీసుకురావాలని భావిస్తుంది. ఈ విషయాన్నీ వాట్సాప్ తన అధికారిక బ్లాగ్ లో ప్రకటించింది. వాట్సాప్ బ్లాగ్ వాబీట ఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కొంతమంది వాట్సాప్ వెబ్ వెర్షన్ బీటా వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది బీటా వెర్షన్ కావడంతో కొద్దీ మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో మిగతా వాట్సాప్ వెబ్ వెర్షన్ వినియోగదారులందరికి తీసుకురానున్నట్లు పేర్కొంది.