Saturday, January 25, 2020

భారత రాజ్యాంగం అమలు


*భారత రాజ్యాంగం*
*26 , నవంబర్*
*Constitution Day*

■ భారత రాజ్యంగo అమలు●

1858 నుంచి 1947 వరకూ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని  పరిపాలించారు,  తరువాత 1947 August 15 న మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు  వదిలి వెళ్ళడo జరిగింది. 
తరువాత మన దేశానికి రాజ్యాంగo  కావాలి  ఎవరు రాయగలరు అని ఒక చిన్న సందేశం వఛింది. మన మొదటి ప్రదాని మంత్రి అయిన నెహ్రూ గారు మన దేశం నుంచి కొంతమందిని అమెరికా లో ఉన్న కొలoబియా  యూనివర్సిటీకి పoపారు, వాళ్ళు  మన వాళ్ళకి మీ దేశం లోనే ఒక ప్రపంచ  మేధావి అయిన Dr B.R అంబేద్కర్ గారిని  పెట్టుకుని ఇక్కడి  వరకూ ఎందుకు వచ్చారు  అని చెప్పి  తిరిగి మన దేశానికి పoపారు. తరువాత  రాజ్యాంగ ముసాయిదా కమిటీ వేసి ఆ కమిటీకి Dr B.R అంబేద్కర్ గారిని  చైర్మన్ గా నియమించారు...

 👉🏼 ఈ విషయాల నుంచి ప్రతీమనిషీ ప్రత్యేకించి దళిత జాతులు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి.

అప్పటికి ఉన్నతవర్గాల ప్రజలూ, మరికొంతమంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండి, మిగతా పౌరులకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని పరిస్థితి భారతదేశంలో నెలకొనిఉంది. *ఆర్ధిక అసమానతలెన్ని ఉన్నా, రాజకీయంగా ప్రతీ పౌరునికీ ఒకే విలువ ఉండాలనీ, లేని పక్షంలో  అసమానతల వల్ల లబ్ధిపొందుతున్న శక్తులు వ్యవస్థను నాశనం చేస్తాయనీ గ్రహించిన బాబాసాహెబ్, తాను రాజ్యాంగ రచనా కమిటీలో ఉండాలనీ, అసమానతలకు తావులేని రాజ్యాంగాన్ని సిద్ధం చేయాలనీ తపనపడడం వల్లే అంతగా శ్రమించి స్థానం సంపాదించుకున్నారు.*

ఐతే, *రాజ్యాంగం ఎంత గొప్పగా రాయబడినా.. రాజ్యాంగం ఎలాంటి శక్తుల చేతిలో ఉంది అన్న విషయం మీద రాజ్యాంగం మంచిదిగా గానీ, చెడ్డదిగా గానీ పరిణమిస్తుంది కనుక, రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది ఈ దేశ పౌరులమీదా, వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతుల్లోనూ ఉంటుందని* తేట తెల్లం చేసారు అంబేద్కర్.

 *“తాను రాసిన రాజ్యాంగం అణిచివేయబడ్డ జాతుల హక్కులను నిలబెట్టలేక విఫలమైన పక్షంలో, దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని కూడా తానే ఔతాన”ని 1949 నవంబరు 25 న, రాజ్యాంగ పరిషత్ నుద్దేశించి తానుచేసిన చివరి ప్రసంగంలో నిష్కర్షగా ప్రకటించారు.*

 దాన్నిబట్టి ,ఈనాడు మనం అనుభవిస్తున్న వివక్షకు కారణం మనం ఎన్నుకున్న తప్పుడు నాయకులే అన్నది ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయం.

ఈ మాటలనుంచి, తాననుకున్నది ఎంత కష్టమైనదైనా సాధించడంలో అంబేద్కర్ చూపించిన బాధ్యత నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి అనే విషయం ఇప్పుడు మనమందరం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న.
తనజాతి ప్రశాంతంగా హక్కులతో అందరితో సమానంగా బ్రతకాలని ఇంత శ్రమించిన బాబాసాహెబ్ కు మనం సరైన గౌరవం ఎప్పుడైనా ఇచ్చామా?

రిజర్వేషన్ల సృష్టికర్తను అన్నం పెట్టినవాడిగా మాత్రమే జమకట్టి, పే బ్యాక్ టు ద సొసైటీని తుంగలో తొక్కిన దొంగలం మనం కామా?

రిజర్వేషన్ వల్ల జీతాలు సంపాదించుకుంటూ, తమ కుటుంబాలకు మాత్రం అంబేద్కర్ చేసిన త్యాగాలను ఏమాత్రం తెలియజేయకుండా వెన్నుపోటు పొడిచిన వారమేకదా మనమంతా?

తాముకూడా మనువాదుల గుంపులో చేరి, తన పక్కింటివాడు బాగుపడితే తనతో సమానమైపోతాడని, దుర్బుద్ధితో ఆలోచించిన వాళ్ళ వల్లే కదా.. ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులనాయకుడిగా మిగిలి, చాందసుల చేతిలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేయబడ్డాడు?

ఈ క్లర్కుల గుంపు నావల్ల లభ్దిపొంది నన్ను మోసం చేసింది అని బాబాసాహెబ్ కళ్ళ నీళ్ళపర్యంతమైంది ఎవరుచేసిన ద్రోహం వల్ల?

బాబాసాహెబ్ ను కులనాయకుడిగా చేసి ఆ మహా మేధావిని స్థానిక నేతకు కుదించే ద్రోహాలు ఇక మానేద్దాం.

ఆయన ఆశయ సాధన అంటే చుట్టూ ఉన్న బడుగుజాతుల బిడ్డలకు విద్యతో పాటూ, కనీస ప్రాధమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా, అవి కల్పించేలా ప్రభుత్వాలను ఒత్తిడి చేయడం.

 బడుగులందరినీ జ్ఞానవంతులను చేయడం, హెచ్చుతగ్గులు లేని వ్యవస్థ అందరి హక్కు అనే భావజాలాన్ని వీలైనంతగా సమాజానికి చేరవేసి, ఈ దేశపు ప్రతీ పౌరుడికీ ఒకటే విలువ కలిగి ఉండేలా ఇప్పటి యువ సమాజాన్నైనా తీర్చిదిద్దాల్సిన బాధ్యత.. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అర్ధంచేసుకున్న, అభిమానిస్తున్న ప్రతీ వ్యక్తిమీదా ఉంది. అలా చేయగలిగినప్పుడే ఆయన విగ్రహానికి దండ వేసి గౌరవించే స్థాయిని మనం సంపాదించుకున్న వారమౌతాం.

కానీ భారతజాతికి దిశను చూపించే రాజ్యాంగ రచనకు అంబేద్కర్ మాత్రమే సరైనవ్యక్తి అని నాటి సభ్యులు  చెప్పడము జరిగింది, తర్వాత రాజ్యాంగ రచన మొదలుపెట్టారు...

అంబేద్కర్ గారు మన బారత *రాజ్యాంగoను రాయడనికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.*

అమెరికా రాజ్యాంగo లో కెవలం 7 ఆర్టికల్స్ ఉన్నయ్.  మొత్తం మన బారత  రాజ్యాంగo లో 395 ఆర్టికల్స్ 12 షెడ్యూల్లు ఉన్నాయి.

 ప్రపoచoలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగo మనది.

*భారత దేశ రాజ్యాంగం మన దేశానికి పవిత్ర గ్రంథం. దేశభక్తి గురించి, నినాదాల గురించి, స్వేచ్ఛ గురించి ఎన్నిరకాల అభిప్రాయాలున్నా… అన్నిoటికీ రాజ్యాంగమే ఆదర్శం.... భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది కాబట్టే రాజ్యాంగం అంటే అందరికీ అంత గౌరవం....అలాంటి రాజ్యాంగానికి కర్తకర్మ అన్నీ అంబేద్కరే....*


త్ర భారతదేశం భవిష్యత్ కు దిక్సూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు అంబేద్కర్..

*భారతజాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి మతాలు, కులాలు, వర్గాలన్నిటినీ ఏకంగా చేసింది. ఏతేడా లేకుండా ప్రతి పౌరుడికీ సమానమైన గుర్తింపు ఇచ్చింది. అందుకే అంబేద్కర్ అందరివాడయ్యారు...*

★అంబేద్కర్ ఆలోచనలే భారతీయులందరి ఆత్మగౌరవం..★
 అందుకే తరాలుగా అట్టడుగున ఉండిపోయిన ప్రజలకు ఆయన దేవుడు. *ఆయన ఆలోచనలను కాదనేవాళ్లకు కూడా ఆయనే ఆదర్శం.* అందరికీ కలిసి ఆయన శాశ్వత అవసరం. ఆ అవసరం అనివార్యంగా మారడానికి కారణం… మన రాజ్యాంగం.
ఏ భేదం లేకుండా… *"భారత ప్రజలమైన మేము…"* అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం.
ఈ ఒక్కమాటతో భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు అంబేద్కర్.

 అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు.

ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు...

మనదేశం కంటే ముందే చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి.... అలా 130కి పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు అంబేద్కర్. అవన్నీ అధ్యయనం చేసి మనకు అవసరం అనుకున్నవి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా మార్పులు చేశారు....

మనదేశంలోని రకరకాల సమాజాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో చాలా ముందుగానే అంచనా వేసి, వాటికి పరిష్కారాలు చూపించేలా రాజ్యాంగ రచన చేశారు అంబేద్కర్....

*దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు. హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది.... కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది. కానీ మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు అంబేద్కర్...*

కొన్ని దేశాల్లో పన్ను కట్టేవాళ్లే ఓటర్లు. కొన్ని దేశాల్లో ఇంకొన్ని అర్హతలున్నవాళ్లకే ఓటు. వాటన్నిటికీ భిన్నంగా… దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్.
టాటా, బిర్లా అయినా… రోజు కూలీ అయినా ఓటుకు ఒకటే విలువ. ఇదే అంబేద్కర్ ప్రతిపాదించిన అసలైన ప్రజాస్వామిక సిద్ధాంతం....

అంబేద్కర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు.... మనదేశంలో సామాజిక వివక్ష ఎలా ఉంటుందో, ఎదగడానికి ఎన్ని కష్టాలుంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా… వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా చేశారు.

*ప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు.*  అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్....

*దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబా సాహెబ్. అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.*

దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్.
అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు. మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన అరుదైననేత అంబేద్కర్.

*దళితుల కోసం మాత్రమే కాదు దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబా సాహెబ్. అంబేద్కర్ ను చదవకుండానే ఆయన్ను దళిత నాయకుడిగా ముద్రవేసిన చాలామందికి ఆయన చెప్పిన సమానత్వం ఎప్పటికీ అర్థం కుండానే ఉండిపోయింది.*

దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను, సమగ్రతను కోరుకున్నాడు  బాబాసాహెబ్ అంబేద్కర్ గారు....

ప్రాథమిక హక్కుల పరిపూర్ణతత్వానికి, ఆదేశిక  సూత్రాలు జీవనాధారంగా  ఉన్నపుడే  సంక్షేమరాజ్యం సాధ్యం అవుతుంది ... 

*ఐక్యరాజ్య  సమితి (UNO) పౌరుల  ఎదుగుదల వారి వికాసము అవిభాజ్యము, అనుఉల్లంఘనీయమైన  " మానవ హక్కులు "  అని ప్రకటించడానికంటే ముందే ఈ ఆదేశిక  సూత్రాలును  రూపొందించిన  ఘనత  అంబెడ్కర్ గారికీ చెల్లుతుంది*.

(26th November, రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా)