శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలకు చేరువవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, మొబైల్ కంపెనీలు తమ ప్రగతిని, కావాల్సిన సమాచారాన్ని కొత్త తరహాల్లో ప్రజల ముంగిట ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలో టోల్‌ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి వచ్చాయి. పైసా ఖర్చులేకుండా.. ఫోన్ చేస్తే కావాల్సిన సమాచారం మనకు చేరువవుతోంది. ఎక్కడి నుంచైనా సమాచారం తెలుసుకోవడం, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెంబర్లు ఉపయోగపడుతున్నాయి. ఫిర్యాదులు చేసేందుకు, కావాల్సిన వస్తువును ఇంటికే నేరుగా తెప్పించుకోవడానికి దోహదపడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నెంబర్ల వివరాలు మీకోసం అందిస్తున్నాం...
టోల్‌ఫ్రీ చరిత్ర...
పోలీసుల కోసం 100...
ప్రమాదాలకు 108...
‘మీ సేవ’ @ 1100...
‘హెచ్‌ఐవీ’ జాగ్రత్తలకు 1997...
‘రైళ్ల’ సమాచారం 138,139...
‘గృహహింస’పై 1091...
మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు గురించి ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, ఇతరుల ఇబ్బందులు ఈ నెంబర్‌లో వివరించవచ్చు.
లంచగొండి అధికారులంటే 155361...
అవినీతి, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ప్రతి పౌరుని వద్ద ఈ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఫోన్ చేస్తే ఏసీబీ అధికారులు లైన్‌లోకి వస్తారు. వీరికి తగిన సమాచారం ఇచ్చి అవినీతిపరుల ఆట కట్టించవచ్చు.
వేధిస్తే 1098...
వేధింపులకు గురవుతున్న మైనర్ల(6-14 సంవత్సరాలలోపు) కోసం ఈ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. బాల, బాలికలు, ‘కిశోర బాలికలు’, గృహహింస, తల్లిదంవూడులు వేధిస్తున్నా, ఇష్టంలేని వివాహాలు చేస్తున్నా, కఠినమైన పనులు చేయిస్తుంటే ఈ నెంబర్‌కు ఫోన్‌చేస్తే అధికారులు సాయం అందిస్తారు.
భద్రతకు 181...
ఓటర్ నమోదుకు 1950...
ఓటరుగా నమోదు కావాలంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. నమోదుకు కావాల్సిన సర్టిఫికెట్‌లు, ఇతర వివరాలకు తెలుసుకోవచ్చు. తొలగింపులు, మార్పులుచేర్పులు తెలుసుకోవచ్చు.
తూకాల్లో మోసాలు చేస్తే
160-4250-3333...
సరుకుల తూకాలలో మోసాలు ఉన్నట్లు గుర్తించినా, కల్తీ సరుకులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
ఆరోగ్య శ్రీ 1800-425-7788...
ఆధార్ వివరాలకు 1800-180-1947...
విదేశాలకు వెళ్లడానికి కావల్సిన పాస్‌పోర్టును పొందేందుకు లేక దరఖాస్తు చేసుకున్నవారు తగిన సమాచారం కోసం ఈ నెంబరును సంప్రదించవచ్చు.