Saturday, August 23, 2014

చీకటి ఖండం - ఆఫ్రికా...?


చీకటి ఖండం - ఆఫ్రికా పోటీ పరీక్షల ప్రత్యేకం ఆఫ్రికా యూరప్‌ ఖండానికి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ దాన్ని చీకటి ఖండంగా పరిగణిస్తారు. 19వ శతాబ్దం చివరి వరకూ ఆఫ్రికా ఖండం గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ఐరోపావాసులు దాన్ని చీకటి ఖండం అని పిలిచేవారు. క్రీ.శ 1840లో స్కాటిస్‌ మిషనరీ అన్వేషకుడైన లివింగ్‌స్టన్‌ మొదటిసారిగా ఆఫ్రికా అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ కామెరూన్‌ అనే మరో అన్వేషకుడిని ఆఫ్రికాకు పంపింది.- లింవింగ్‌స్టన్‌ మధ్య ఆఫ్రికా, టాంగాన్యికా, నియస్సా ప్రాంతాలను ఆవిష్కరించాడు.- కామెరూన్‌ కాంగో ప్రాంతాన్ని కనుక్కున్నారు.- బెల్జియం రాజు లియోపోల్ట్‌-2 క్రీ.శ.1879లో స్టాన్లీని ఆఫ్రికాకు పంపించడంతో అతడు తూర్పు ఆఫ్రికాకు సంబంధించిన విషయాలను ప్రపంచానికి తెలియజేశాడు.- యూరోపియన్‌లు నీగ్రో బానిసల కోసం ఆఫ్రికాకు వచ్చేవారు. 19వ శతాబ్దం నాటికి ఐరోపావాసులు ఆఫ్రికా గురించి పూర్తిగా తెలుసుకున్నారు.శీతోష్ణస్థితి ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ ఖండం ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలు రెండింటిలో వ్యాపించి ఉండటం వల్ల ఆఫ్రికా ఖండంలో వైవిధ్యమైన శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి.- ఉత్తరార్ధ గోళంలో మే నుంచి అక్టోబరు వరకూ వేసవి కాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం ఉంటుంది.- ఉత్తర్ధా గోళంలో నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకూ చలికాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది.- ఆఫ్రికా ఖండం సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌- ఆఫ్రికా ఖండంలో నాలుగు రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.భూమధ్య రేఖా శీతోష్ణస్థితి... ఈ ఖండంలో కాంగోనది హరివాణంలోని దేశాలు గేబన్‌, కాంగో, జైరే, కెమెరూన్‌, టాంజానియా, సెంట్రల్‌ రిపబ్లిక్‌, మొజాంబిక్‌, లైబీరియా, ఐవరీకోస్టు దేశాల్లో భూమధ్యరేఖా శీతోష్ణస్థితి ఉంటుంది. భూమధ్యరేఖా ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడిన అల్పపీడన మేఖలను డోల్డ్రమ్స్‌ అంటారు. డ్రోల్డమ్స్‌ అంటే ప్రశాంత పవనాలు. ఆఫ్రికా ఖండంలోని కెమెరూన్‌ శిఖరం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశాల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ప్రాంతంలో పర్వతీయ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.సుడాన్‌ రకపు శీతోష్ణస్థితి.. భూమధ్యరేఖ శీతోష్ణస్థితికి ఇరువైపులా ఉన్న పర్వతాల వెలుపల సుడాన్‌ రకపు శీతోష్ణస్థితి ఉంది.ఆఫ్రికా - ఉప్పునీటి సరస్సులు.. ఆఫ్రికా ఖండంలోని ఎడారి ప్రాంతంలో సరస్సులు ఉండటం వల్ల తక్కువ వర్షపాతం వల్ల, ఎడతెరపి లేకుండా సరస్సుల్లోని ఆవిరై లవణాలు మిగిలి పోతున్నందువల్ల, సరస్సుల నుంచి బయటకు ప్రవాహాలు లేనందు వల్ల, నీటిలో కరిగిన లవణాల గాఢత ఎక్కువై ఉప్పునీటికి ఉప్పదనం ఏర్పడుతుంది. ఈ ఖండంలో న్యాసా, విక్టోరియా, గామి, చాద్‌, సరస్సులు ఉన్నాయి. వీటిలో చాద్‌, గామి ఉప్పునీటి సరస్సులు.విక్టోరియా జలపాతం జాంబెజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం వెడల్పు 1.7కి.మీ. ఇది 108 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జాంబియా, జింబాబ్వే దేశాల్లోని జాతీయ పార్కుల్లో నుంచి చేస్తే విక్టోరియా ప్రకృతి సౌందర్యం సంపూర్ణంగా కనిపిస్తుంది