Sunday, August 13, 2023

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 6329 పోస్టులు

 




*ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 6329 పోస్టులు*

*🌺దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఈఎంఆర్‌ఎస్‌)లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌ (ఈఎస్‌ఎస్‌ఈ-2023 నోటిఫికేషన్‌ను నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ విడుదల చేసింది.*

*👉 మొత్తం ఖాళీలు: 6329*
*పోస్టుల వారీగా ఖాళీలు*
టీజీటీ-5660

🌺 *టీజీటీలో సబ్జెక్టుల వారీగా ఖాళీలు*

👉 హిందీ- 606
👉 ఇంగ్లిష్‌-671
👉 మ్యాథ్స్‌-686
👉 సోషల్‌ స్టడీస్‌-670
👉 సైన్స్‌-678
👉 టీజీటీ థర్డ్‌ లాంగ్వేజ్‌-652 👉 (తెలుగు- 102)

*💥టీజీటీ మిస్‌లీనియస్‌ కేటగిరీ*

👉 మ్యూజిక్‌ – 320
👉 ఆర్ట్‌ – 342
👉 పీఈటీ (మేల్‌)- 321
👉 పీఈటీ (ఫిమేల్‌)- 345
👉 లైబ్రేరియన్‌ – 369
👉 మొత్తం ఖాళీలు: 1697

*💥నాన్‌ టీచింగ్‌ పోస్టులు*

👉 హాస్టల్‌ వార్డెన్‌ (మేల్‌)- 335
👉 హాస్టల్‌ వార్డెన్‌ (ఫిమేల్‌)-334
👉 మొత్తం ఖాళీలు: 669

👉అర్హతలు: *ఆర్‌ఐఈలో నాలుగేండ్లు ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఈడీ ఉత్తీర్ణత. దీనితోపాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*

*👉 హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత. మిగిలిన పోస్టుల అర్హతల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.*

💥ఎంపిక:

*👉 ఎగ్జామ్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) – 120 మార్కులకు*

*👉 లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ – 30 మార్కులకు*

*👉 ఈ పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఐసీటీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, డొమైన్‌ నాలెడ్జ్‌, లాంగ్వేజ్‌ కాంపిటెన్సీపై ప్రశ్నలు ఇస్తారు.*

*💥హాస్టల్‌ వార్డెన్‌*

*👉 జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఐసీటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ పోక్సో, అడ్మినిస్ట్రేటివ్‌ ఆప్టిట్యూడ్‌, లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ జనరల్‌ హిందీ, జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనల్‌ లాంగ్వేజ్‌పై పరీక్ష నిర్వహిస్తారు.*

నోట్‌: *పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.*

*💥ముఖ్యతేదీలు*

👉 దరఖాస్తు: *ఆన్‌లైన్‌లో*

👉 చివరితేదీ: - ఆగస్టు 18

👉 ఫీజు: - టీజీటీ పోస్టుకు రూ.1500/-,

👉 హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుకు  రూ.1000/-

👉 వెబ్‌సైట్‌:   www.emrs.tribal.gov.in

Tuesday, August 8, 2023

ఎయిర్‌టెల్‌ 5జీ వైర్‌లెస్ వైఫై ప్రారంభం..

 

 


దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ (Xstream AirFiber) పేరిట ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ 5జీ సర్వీస్‌లను ప్రకటించింది. ఢిల్లీ,  ముంబై నగరాల్లో తొలి 5జీ టెక్నాలజీ ఆధారిత ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవలను ప్రారంభించింది.

నెట్‌వర్క్‌ అందుబాటులోని మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ 5జీ వైర్‌లెస్‌ సేవలు అందుబాటులోకి తీసువచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ ఫైబర్‌ వైర్‌లెస్‌గా 100 Mbps వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తుంది.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ అనేది స్వతంత్రంగా పనిచేసే ఓ ప్లగ్ అండ్ ప్లే పరికరం. వైఫై 6 ప్రమాణాలతో అంతరాయం లేకుండా విస్తృత నెట్‌వర్క్ కవరేజీని అందిస్తుంది. దీని ద్వారా ఏకకాలంలో  64 ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ పరికరానికి సంబంధించిన హార్డ్‌వేర్ పరికరాలన్నీ భారత్‌లోనే తయారైనట్లు కంపెనీ పేర్కొంది.  గత మూడు నాలుగేళ్లుగా ఇళ్లలో ఉపయోగించే వైఫై సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని,  ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌తో ఫిజికల్ ఫైబర్ నెట్‌వర్క్ సదుపాయం లేని ప్రాంతాలకు కూడా వేగవంతమైన వైఫై ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని కంపెనీ పేర్కొంది. 

ప్రస్తుతం డిల్లీ, ముంబై నగరాల్లోనే ఈ సేవలు ప్రారంభించినప్పటికీ రాబోయే రోజుల్లో దేశమంతటా విస్తరించాలని యోచిస్తోంది. 5జీ ఆధారిత ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించిన మొదటి కంపెనీ ఎయిర్‌టెల్. అయితే కొన్ని నెలల క్రితం జియో కూడా జియో ఎయిర్‌ఫైబర్ పేరుతో ఇటాంటి సర్వీసునే తీసుకురాన్నుట్లు ప్రకటించింది.  ప్రస్తుతానికి జియో ఎయిర్‌ఫైబర్‌ ధరలు ఎంత ఉంటాయి.. అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న వివరాలపై సమాచారం లేదు.

ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ఫైబర్‌ ప్లాన్‌ వివరాలు
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ నెలకు రూ. 799. హార్డ్‌వేర్ కాంపోనెంట్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా అదనంగా రూ. 2,500 చెల్లించాలి. మొత్తం ఆరు నెలల ప్యాకేజ్‌ 7.5 శాతం తగ్గింపుతో రూ. 4,435లకే అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ అపరిమిత డేటాను ఆఫర్ చేస్తుందా లేదా మిగిలిన  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మాదిరిగానే పరిమితి ఉంటుందా అనేది స్పష్టత లేదు.

 

 

Saturday, August 5, 2023

Usefull Websites

 1. YouTube Download mp 4

 

2. toonme : Images AI Edited

 

3.Goolge Bard

 


 4. YouTube mp3

 

5.Web Apps by 123apps

 

6.symbols

 

7.play2048.co/

 


 

 

 

 

 

Thursday, August 3, 2023

ఆధార్‌ అప్‌డేట్‌పై బిగ్‌ న్యూస్‌.. అప్పటి వరకూ సమయాన్ని పెంచుతూ కీలక ప్రకటన

 


 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిర్వహించే సుమారు 1,200 ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సేవా బట్వాడా కోసం ఆధార్ ఆధారిత గుర్తింపు ఉపయోగిస్తారు. అదనంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటి ఆర్థిక సంస్థల వంటి సేవా ప్రదాతలు అందించే అనేక ఇతర సేవలు కూడా వినియోగదారులను సులభంగా ప్రామాణీకరించడానికి, ఆన్‌బోర్డ్ చేయడానికి ఆధార్‌ను ఉపయోగిస్తున్నాయి.

భారతదేశంలో ‍ప్రతి చిన్న అవసరానికి ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడానికి ఆధార్‌ తప్పనిసరి చేయడంతో ఆధార్‌ కార్డును లైవ్‌లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకూ ఆధార్‌ ఏదో రూపంలో అవసరం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిర్వహించే సుమారు 1,200 ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సేవా బట్వాడా కోసం ఆధార్ ఆధారిత గుర్తింపు ఉపయోగిస్తారు. అదనంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటి ఆర్థిక సంస్థల వంటి సేవా ప్రదాతలు అందించే అనేక ఇతర సేవలు కూడా వినియోగదారులను సులభంగా ప్రామాణీకరించడానికి, ఆన్‌బోర్డ్ చేయడానికి ఆధార్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేటింగ్ రూల్స్ 2016 ప్రకారం ఆధార్ నంబర్ హోల్డర్‌లు తమ డేటా కచ్చితత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి కనీసం పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌లో తమ సపోర్టింగ్ పేపర్‌లను అప్‌డేట్ చేయాల్సి ఉంది. అందువల్ల ఈ ఏడాది జూన్‌ 14 వరకూ ఈ సేవను ఫ్రీగా అందించిన ప్రభుత్వం తాజాగా గడువును పెంచింది. కాబట్టి ఆధార్‌ అప్‌డేట్‌ గురించి కీలక విషయాలను తెలుసుకుందాం. 

ఆధార్ నంబర్ హోల్డర్లందరూ తమ డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి కనీసం పదేళ్లకు ఒకసారి ఆధార్‌లో తమ సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఎఐ) సూచించింది. యూఐడీఏఐ నెటిజన్ల కోసం ఆధార్ కార్డ్ పత్రాల నవీకరణ కోసం ఉచిత సర్వీస్‌ను ప్రారంభించింది.  గతంలో ఈ గడువు జూన్‌ 14 వరకూ ఉండగా ప్రస్తుతం సెప్టెంబర్‌ 30 వరకూ ఉంచింది. ఈఉచిత సేవ ప్రత్యేకంగా మైఆధార్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉండాలి. అయితే మీరు భౌతిక ఆధార్ కేంద్రాలను ఉపయోగించాలనుకుంటే రూ. 50 ఛార్జీ ఇప్పటికీ వర్తిస్తుంది. మీరు మీ జనాభా సమాచారాన్ని (పేరు, పుట్టిన తేదీ, చిరునామా మొదలైనవి) అప్‌డేట్ చేయాలనుకుంటే మీకు రెండు ఎంపికలు ఉన్నాయి. మీరు ప్రామాణిక ఆన్‌లైన్ అప్‌డేట్ సేవను ఉపయోగించవచ్చు లేదా మీ స్థానిక ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. కాబట్టి ఆన్‌లైన్‌లో ఈ సేవను ఎలా ఉపయోగించుకోవాలో? ఓసారి చూద్దాం.

యూఐడీఏఐలో అప్‌డేట్‌ ప్రాసెస్‌ ఇదే..

https://myaadhaar.uidai.gov.in/ 

  • స్టెప్‌-1: మై ఆధార్‌ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి.
  • స్టెప్‌-2: ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ఎంచుకుంటే మీ ప్రస్తుత వివరాలు ప్రదర్శితమవుతాయి.
  • స్టెప్‌-3: వివరాలను ధ్రువీకరించి, తదుపరి హైపర్‌లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్‌-4: డ్రాప్‌డౌన్ జాబితా నుంచి గుర్తింపు రుజువు, చిరునామా పత్రాలను ఎంచుకోవాలి.
  • స్టెప్‌-5: స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసి చెల్లింపు చేయడానికి కొనసాగండి.
  • స్టెప్‌-6: చెల్లింపు ప్రాసెస్‌ అయ్యాక వ్యాలిడేషన్‌ అనంతరం మీ ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ అవుతుంది. 

 

 Tags: aadhar update, aadhar update check, uidai aadhar update, mobile number aadhar update mobile number aadhar update documents aadhaar update online aadhar update online aadhaar update status aadhar update address aadhar update application aadhar update app aadhar update address proof aadhaar update appointment aadhar update age aadhar update age limit aadhar update agents near me airtel aadhar update aadhaar address update

Keywords  : #aadharupdate ,#Aadharaddresschange 

66 లక్షల వాట్సాప్‌ అకౌంట్లు బ్యాన్‌.. కారణం ఇదే...

 


మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.

2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు వాట్సాప్‌ తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు జూన్‌ నెలలో 7,893 ఫిర్యాదులు అందగా వీటిలో 337 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

 వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్‌లకు పైగా యూజర్లు ఉన్నారు. యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌లో నమోదైన ఫిర్యాదులకు అనుగుణంగా కొన్ని అకౌంట్లపై చర్యలు తీసుకోగా నిబంధనలు అతిక్రమించిన మరికొన్ని అకౌంట్లపై ముందస్తు చర్యలు చేపట్టినట్లు వాట్సాప్‌ పేర్కొంది. చర్యల నిమిత్తం గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపింది.