Saturday, November 16, 2024

గ్రూప్ 3 పరీక్షల మార్గదర్శకాలు- GROUP 3 EXAM GUIDELINES

 

 


: TGPSC GROUP 3 EXAM GUIDELINES. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 3 పరీక్షలను నవంబర్ 17, 18 వ తేదీలలో మూడు సెషన్స్ లో నిర్వహించనుంది. ఇప్పటికే గ్రూప్ – 3 హల్ టికెట్లను విడుదల చేశారు.

 మొత్తం 3 పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. 17వ తేదీన రెండు పేపర్లు, 18వ తేదీన ఒక పేపర్ నిర్వహించనున్నారు.

GROUP 3 EXAM SCHEDULE

17వ తేదీన ఉదయం 10.00 – 12.30 వరకు పేపర్ – 1

17వ తేదీన సాయంత్రం 3.00 – 5.30 వరకు పేపర్ – 2

18వ తేదీన ఉదయం 10.00 – 12.30 వరకు పేపర్ – 3

రాష్ట్ర వ్యాప్తంగా 1,401 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

మొత్తం 1388 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ను జారీ చేసిన సంగతి తెలిసిందే

గ్రూప్ – 3 పరీక్ష మార్గదర్శకాలు

పరీక్ష కేంద్రానికి బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మరియు మూడు నెలల లోపు తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించిన హల్ టికెట్ తో పాటు ఒక ఐడీ కార్డుతో పరీక్ష కేంద్రంలో తీసుకొని రావాల్సి ఉంటుంది

మొదటి పరీక్ష కు తీసుకొచ్చిన హాల్ టికెట్ కాపీనే మూడు పేపర్లకు తీసుకుని రావాల్సి ఉంటుంది. హాల్ టికెట్ మారితే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

ఒకవేళ హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో సరిగ్గా పడకపోతే మూడు పాస్పోర్ట్ ఫోటోలు తీసుకుని రావాల్సి ఉంటుంది మరియు గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టించుకుని రావాల్సి ఉంటుంది.

అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం సెషన్ కు 8:30 నుండి సాయంత్రం సెషన్ కు 1.30 నుండి అనుమతిస్తారు. ఉదయం సెషన్ 9.30, సాయంత్రం సెషన్ 2.30 కి గేట్లు మూసివేయబడును.

ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోబడును. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.

హాల్ టికెట్ లో ప్రతి సెషన్ లోను ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థి రాసే పరీక్ష పేపర్ కు కేటాయించిన చోటు సంతకం పెట్టవలసి ఉంటుంది.

పరీక్షను OMR పద్దతిలో నిర్వహించనున్నారు.

ఎలాంటి ఉల్లంగణలు చేసిన చట్టపరమైన చర్యలు చేపట్టబడును.

ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను గాడ్జెట్స్ ను పరీక్ష హాల్లోకి అనుమతించారు.

Wednesday, November 6, 2024

TG TET 2024 Notification: తెలంగాణ టెట్‌ (నవంబర్) 2024 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 


 

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024 నవంబర్) 2024 నోటిఫికేషన్‌ సోమవారం (నవంబర్‌ 4) విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి (నవంబర్‌ 5) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక టెట్ ఆన్‌లైన్‌ ఆధారిత కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన వెలువరించింది. టెట్‌కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని రేవంత్‌ సర్కార్‌ గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు టెట్ తొలివిడత ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు జూన్ 12న ప్రకటించింది. దాదాపు 2.35 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవగా.. వీరిలో 1.09 మంది అర్హత సాధించారు. తాజాగా రెండో విడత టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్‌ పరీక్షలు జరుపుతామని తెలుపుతూ ఈ ఏడాది ఆగస్టులో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది కూడా. ఈ క్రమంలో నవంబరు 4న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సర్కార్ టెట్‌ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో ఇప్పటికే డీఎస్సీ నియామక ప్రక్రియ ముగిసింది. అయితే త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని గతంలో పలుమార్లు అధికారులు తెలిపారు. ఏదీఏమైనా ఈ సారి టెట్‌ పరీక్షకు హాజరయ్యే రాసే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్‌ 1కు డీఈడీ, పేపర్‌ 2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో విధుల్లో ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరో సారి టెట్‌ పరీక్ష జరగనుంది.

  website https://tstet2024.aptonline.in/tstet/